Header Banner

టీటీడీకి భారీ విరాళం ఇచ్చిన ఎన్ఆర్ఐ! ఎన్ని కోట్లంటే?

  Thu May 15, 2025 21:38        Devotional

అమెరికాలోని బోస్టన్‌కు చెందిన ఎన్నారై భాగవతుల ఆనంద్ మోహన్, తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ట్రస్టులకు భారీ విరాళాలు అందజేశారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుని తిరుమలలోని క్యాంపు కార్యాలయంలో కలిసి విరాళాల చెక్కులను అందించారు. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్‌ బీఆర్ నాయుడు ఆయన సేవా మనోభావాన్ని కొనియాడారు. తిరుమల శ్రీవారి సేవలో భాగంగా ఎన్నారైలు ఇటువంటి విరాళాలు ఇవ్వడం పట్ల దేవస్థానం కృతజ్ఞతలు తెలిపింది.


ఆనంద్ మోహన్ రూ.1,40,05,696 విలువైన విరాళాలను పలు ట్రస్టులకు పంపిణీ చేశారు. వాటిలో..

ఎస్వీ ప్రాణదాన ట్రస్ట్ - రూ.1,00,01,116

ఎస్వీ గోసంరక్షణ ట్రస్ట్ - రూ.10,01,116

ఎస్వీ విద్యాదాన ట్రస్ట్ - రూ.10,01,116

ఎస్వీ వేదపరిరక్షణ ట్రస్ట్ - రూ.10,01,116


మరోవైపు తిరుమలలో దర్శనాలకు సంబంధించి టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. మే 15వ తేదీ నుంచి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల లేఖలకు మాత్రమే తాత్కాలికంగా తిరిగి అనుమతిని ఇవ్వనున్నట్టు టీటీడీ ప్రకటించింది.

నూతన మార్గదర్శకాలు..

సిఫార్సు లేఖలు తప్పనిసరిగా ప్రామాణిక లెటర్‌హెడ్ పై ఉండాలి.

సంబంధిత అధికారుల సంతకాలు తప్పనిసరిగా ఉండాలి.

ఈ నిబంధనలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ప్రజాప్రతినిధులకు మాత్రమే వర్తించనుంది.

ఇతర రాష్ట్రాల నాయకులు, ప్రముఖుల లేఖలు పరిగణనలోకి తీసుకోబడవు.


ఇది కూడా చదవండితల్లులకు భారీ శుభవార్త.. తల్లికి వందనం అమలుపై అప్‌డేట్! ఆ రోజు అకౌంట్లలోకి మనీ!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

మరోసారి భారీగా ఉద్యోగాల కోతకు సిద్ధమైన మైక్రోసాఫ్ట్! వేల మంది టార్గెట్!


వీరయ్య చౌదరి హత్య కేసు ఛేదించిన పోలీసులు.. 9 మందిని అరెస్ట్! హత్యకు కారణం ఇదే!



వైసీపీకి షాక్.. మాచర్ల మున్సిపల్ చైర్మన్కు షాకిచ్చిన సర్కార్.. పదవి నుండి తొలగింపు!



సింధూ జలాలపై కాళ్ల బేరానికి పాకిస్థాన్! భారత్‌కు విజ్జప్తి చేస్తూ లేఖ!



కడప మేయర్ కు భారీ షాక్‌! అవినీతి ఆరోపణలతో పదవి నుండి తొలగింపు!



చంద్రబాబు నేతృత్వంలో పొలిట్‌బ్యూరో సమీక్ష! నామినేటెడ్ పదవులపై ఫోకస్!


బెట్టింగ్ మాఫియాకు షాక్! ఇద్దరు బుకీలు అరెస్ట్.. మాజీ కేసులు మళ్లీ రంగంలోకి!

 

పొరపాటున వేరే రైలెక్కిన మహిళ..! ఇంతలోనే ఎంత ఘోరం..!

 

హైదరాబాద్‌ విమానాశ్రయంలో హై అలెర్ట్! డ్రోన్లకు నో పర్మిషన్!

 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #TTD #NRIContribution #HugeDonation #Tirumala #Devotion #TTDNews #SpiritualIndia